Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పాప్యులర్ యాప్ లు తొలగింపు

  • వీటిలో సరహా, యాడ్ అవే, టీవీ పోర్టల్
  • యూట్యూబ్ వీడియోల డౌన్ లోడ్ కు వీలు కల్పిస్తున్న ట్యూబ్ మేట్ పైనా వేటు
  • కాపీ రైట్ సహా పలు కారణాలతో నిషేధం
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రముఖ యాప్ లు తొలగింపునకు గురయ్యాయి. వీటిలో సరహా మెస్సేజింగ్ యాప్ కూడా ఒకటి. సరహా అనేది తామెవరో తెలిసే అవకాశం లేకుండానే ఎదుటి వారికి సందేశాలు పంపుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీంతో వేధింపులకు ఇదో వాహకంగా మారిపోయింది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు గూగుల్ దీన్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

ట్యూబ్ మేట్ కూడా తొలగింపునకు గురైంది. ఈ యాప్ యూట్యూబ్ నుంచి వీడియోలను నేరుగా యూజర్ల ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇదే గూగుల్ కు నచ్చలేదు. యూట్యూబ్ వీడియోలను నచ్చినప్పుడు చూసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. డౌన్ లోడ్ చేసుకునేందుకు లేదు.

సీఎం ఇన్ స్టాలర్ కూడా ప్లే స్టోర్లో స్థానం కోల్పోయింది. సైనోజెన్ మోడ్ ఆర్ వోఎం ఇన్ స్టలేషన్ కు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. నచ్చిన టీవీ షోను చూసుకునేందుకు వీలు కల్పించే టీవీ పోర్టల్ యాప్ ను కాపీరైట్ ఉల్లంఘనల అంశం కింద గూగుల్ నిషేధించింది. యాడ్ అవే అనే మరో యాప్ ను కూడా గూగుల్ తన వ్యాపార కోణం రీత్యా నిషేధించింది. ఈ యాప్ ప్రకటనలను బ్లాక్ చేసేస్తుంది. గ్రూవ్స్ షార్క్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్, అమేజాన్ అండర్ గ్రౌండ్ తదితర యాప్ లు కూడా ప్లే స్టోర్ నుంచి స్థానం కోల్పోయినవే.
google play store
apps

More Telugu News